కరీంనగర్ మండలం ముగ్దూంపూర్ గ్రామ శివారులో గంజాయి విక్రయిస్తున్న నిందితున్ని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం SI నరేష్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మొగ్దుంపూర్ గ్రామ శివారులోని బస్టాండ్ దగ్గరలో ఓ వ్యక్తి అనుమానస్పదముగా కనిపించి పోలీసులను చూసి పారి పోతుండగా పోలీసులు వెంబడించి కొంచం దూరంలో పట్టుకొని బ్యాగ్ తనిఖీ చేయగా అందులో ప్రభుత్వం నిషేదించినటువంటి గంజాయి లభ్యమయింది. అతడిని విచారించగా పేరు దీపక్ కుమార్ ముక్తియా తెలిపాడు. అతని నుండి 1120 గ్రాముల గంజాయి, 5600 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చేశారు.