యూరియాను రైతులకు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం దేవనకొండ మండలం తెర్నేకల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. యూరియా కొంతమంది అధికార పార్టీ నాయకులకు అందుతుంది తప్ప సామాన్య రైతులకు పూర్తిస్థాయిలో అందడంలేదన్నారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి సూరి, రైతులు పాల్గొన్నారు.