కార్పొరేట్, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే సీతారాం ఏచూరికి అర్పించే ఘనమైన నివాళి సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు పిలుపునిచ్చారు. శనివారం ఉదయం 12 గంటలు సిపిఎం కర్నూలు నగర కమిటీల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ పూర్వపు ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా వర్తమాన రాజకీయాలు = సిపిఎం వైఖరి అనే అంశంపై సిపిఎం ఓల్డ్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన సభ జరిగింది.. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు మాట్లాడుతూ సీతారాం ఏచూరి భారత రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారని దేశంలో రాజకీయ పార్టీలన్న