విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాపులో అన్నమయ్య జిల్లా AISA అధ్యక్షుడు తుమ్మల లవకుమార్‌ను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. విద్యార్థుల సమస్యలపై నిరంతర పోరాటాలు చేసినందుకు గాను రాష్ట్ర నాయకత్వం ఈ పదవి తనకు అప్పగించిందని లవకుమార్ తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, విద్యా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.