అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని శివరాంపేట లో విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామానికి చెందిన సీనప్ప అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో తీవ్రమైన మనస్థాపం చెందినా అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.