శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి రంగారెడ్డి జిల్లా నుంచి సత్యసాయి భక్తులు రెండు రోజుల పాటు పర్తియాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాలులో నిర్వహించిన సంగీత కచేరి భక్తులను ఆకట్టుకుంది. ప్రతి ఏడాది రెండు రోజుల పాటు రంగారెడ్డి జిల్లా నుంచి పర్తియాత్ర నిర్వహిస్తామని సత్యసాయి భక్తులు పేర్కొన్నారు. ఈ ఏడాది కూడా నిర్వహించినట్లు తెలిపారు.