ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలానికి చెందిన పలువురు యువకులు మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మండల అధ్యక్షుడు రాజేష్ సమక్షంలో యువకులు జనసేన జెండా కప్పుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులమై పార్టీలో చేరినట్లుగా యువకులు తెలిపారు. జనసేనలో చేరిన యువకులను మండల అధ్యక్షుడు రాజేష్ అభినందించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మండల అధ్యక్షుడు రాజేష్ అన్నారు.