రైతుల కోసం వీరనారి చాకలి ఐలమ్మ చేసిన పోరాటం అనిర్వచనీయమని ఎమ్మెల్యే పాయల్ అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఆమె వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట గల ఐలమ్మ విగ్రహానికి అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రజక సంఘం సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.