రాయదుర్గం పట్టణంలో వివిధ శాఖలలో పనిచేసే ఉద్యోగులు పలువురు పదవీవిరమణ పొందారు. ఆదివారం ఉదయం జరిగిన వీరి సత్కార సభలలో ఉన్నతాధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు. రాయదుర్గంలో 13 ఏళ్ల పాటు ఎంఈఓ గా సేవలు అందించిన నాగమణి రిటైర్మెంట్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఎంపిడిఓ కొండన్న, ఎంఈఓ వెంకటరమేష్, సోమశేఖర్, రామచంద్ర, సిడిపిఓ పద్మావతి, ఉపాధ్యాయ సంఘాల నేతలు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని ఆమె సేవలు కొనియాడారు. అలాగే ఆర్టీసిలో ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్ రిటైర్డ్ కావడంతో డిపో వద్ద ఘనంగా సత్కార సభను నిర్వహించారు. డిపో మేనేజర్ శ్రీనివాస్, ఎంప్లాయిస్ యూనియన్, ఎన్ఎంయూ నేతలు పాల్గొన్నారు.