వదినను చంపిన కేసులో మరిదిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం తెలిపారు.శనివారం సాయంత్రం రూరల్ సీఐ తెలిపిన వివరాల మేరకు పగి డ్యాల మండల పరిధిలోని ఎం. ఘణపురం గ్రామానికి చెందిన సుగాలి నాగమ్మ గత కొన్ని రోజుల నుండి రైతుపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని అతను ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. గ్రామంలో తమ కుటుంబ పరువు తీస్తుందని తన ప్రవర్తనను మార్చుకోవాలని ఎన్నిసార్లు ఆమెకు చెప్పినా ప్రవర్తనను మార్చుకోక పోవడంతో మృతురాలికి మరిది అయిన సుగాలి లోక నాయక్ ఎలాగైనా వదినను చంపి కుటుంబ పరువును కాపాడాలనే ఉద్దేశ్యంతో ఈనెల 4వ తేదీ ఉదయం