41 వార్డులో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్ట ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని 41 వ వార్డు వైఎస్ఆర్సిపి నాయకులు కోడిగుడ్ల శ్రీధర్ తెలియజేశారు. బుధవారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ సహకారంతో అనేక అభివృద్ధి పనులకు ఇప్పటికే పూర్తి కావచ్చు అని తెలియజేశారు. అయితే వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోతున్నాయని వాహనాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. పప్పు దినుసులను కూడా జాగ్రత్త చేసుకోవాలని సూచించారు.