కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లా అని పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం 11 గంటలకు కర్నూలు దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద సంతకాల సేకరణ నిర్వహించారు. సంజీవయ్య వృద్ధాప్య పింఛను, కార్మికులకు బోనస్ వంటి సంక్షేమ పథకాలను దేశంలోనే మొదట అమలు చేసిన ఘనత సాధించారని నేతలు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.