సొంత వనరులతో గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలన్న అంశంపై అవగాహన సదస్సు జరిగింది. ఆళ్లగడ్డలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నూర్జహాన్ అధ్యక్షతన సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు, డిజిటల్ అసిస్టెంట్లకు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు రెండు రోజులపాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో నూర్జహాన్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై అవగాహన అవసరమని పేర్కొన్నారు.