కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయాన్ని సోమవారం ప్రముఖ గాయకుడు మనో కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి తైలాభిషేకం నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచనాలు, స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.