కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లి గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో బుధవారం ఓ వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అడవిలో వృద్ధురాలి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కళ్యాణ దుర్గం రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.