నంద్యాల జిల్లా అవుకు రిజర్వాయర్ వద్ద జలపాతం ప్రకృతి ప్రియులను కనువిందు చేస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున రిజర్వాయర్లోకి జలపాతం జాలువారుతూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఉప్పలపాడు, కునుకుంట్ల వైపు కొండల నుంచి నీరు జలపాతం రూపంలో వచ్చి చేరుతోంది. దీంతో పర్యాటకులు పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.