అల్లూరి జిల్లా పాడేరు జిల్లా ఆస్పత్రికి రోగులు తాకిడి విపరీతంగా పెరిగింది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పాడేరు జిల్లా ఆస్పత్రిలో వివిధ రోగాల బారిన పడిన వారంతా క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా అల్లూరి జిల్లా ఏజెన్సీ మారుమూల గ్రామాలు, మండల కేంద్రాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలడంతో వివిధ రకాల రోగాల బారిన పాడిన వారంతా పాడేరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం బారులు తీరారు.