కూన రవికుమార్ చేసిన ఆరోపణ అవాస్తవం , ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ తనపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని శ్రీకాకుళం జిల్లా, పొందూరు కేజీబీవీ ప్రిన్సిపల్ రేజేటి సోమ్య తెలిపారు. శనివారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా కోన రవికుమార్ తన వ్యక్తిగత విషయాలు పైన మాట్లాడి తీరు బాలేదని, అన్యాయంగా కంచిలి ట్రాన్స్ఫర్ చేయడం అగదని, దీనిపై వెంటనే సి బి సి ఐ డి సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయాలని ఆమె కోరారు