మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ డివిజన్లో యూరియా సరిగా సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా నర్సాపూర్ వ్యవసాయ డివిజన్లోని ఆయా మండలాల్లో యూరియా కోసం రైతుల పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.