కాగజ్ నగర్ మండలం కోసిని డ్యాం లో ఓ విద్యార్థి స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఆదివారం సెలవు దినం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి కోసిని డ్యామ్ లోకి స్నానానికి వెళ్ళగా కాగజ్నగర్ పట్టణంలోని బాలాజీ నగర్ కు చెందిన అంకిత్ రాథోడ్ గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతైన విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అంకిత్ రాథోడ్ పట్టణంలోని సెయింట్ క్లారెట్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాడు,