వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై చంద్రబాబు కావాలని విష ప్రచారం చేస్తున్నారని వైసిపి రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి త్రివేణి రెడ్డి అన్నారు. శనివారం విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా వైఎస్ జగన్ పూజలు నిర్వహిస్తే కావాలని దుర్మార్గంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. విజయవాడ నగరంలో 40 దేవాలయాలని కూల్చిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.