ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఖండాల గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. శనివారం ఖండాల నుండి ఆదిలాబాద్ వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది కార్తిక్ సింగ్, విట్టల్ గౌడ్ క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.