Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
సింగరేణి పాఠశాలల్లోకి చొరబడిన భారీ నాగుపాము జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని సింగరేణి పాఠశాలలోకి భారీ నాగుపాము చోరబడింది. ఆదివారం రాత్రి అందాల 7 గంటల సమయంలో నాగుపాము క్లాస్ రూమ్ లోకి వెళ్లడానికి గుర్తించిన అటెండర్ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే పాములు పట్టే వ్యక్తి అయినటువంటి రహీం సైతం సమాచారం అందించడంతో రహీం వెంటనే అక్కడకు చేరుకొని నాగుపాముని బంధించి డబ్బాలో వేసుకొని వెళ్లారు కాగా ఆదివారం సెలవు దినం కావడంతో ఎవరికి ఇలాంటి హాని కలగలేదని స్థానికులు చెప్పుకొచ్చారు.