ఆటో కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి... పాత గాజువాక జంక్షన్లో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన, మహిళా స్త్రీ శక్తి పథకం వలన, తమ ఉపాధిలో కోల్పోయాయని సిఐటియు ఆధ్వర్యంలో 86 స్టాండ్లు ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, రాంబాబు, 86 స్టాండ్ ల అధ్యక్షులు జి నాయుడు, మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు వలన రాష్ట్రంలో సుమారు 45 లక్షల మంది ఆటో కార్మికులు కుటుంబాలు రోడ్డును పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉచిత బస్సు ఆటో కార్మికులు కడుపు కొడుతోంది మండిపడ్డారు.