అనంతపురం నగరంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం మధ్యాహ్నం కాలువ నీటి ప్రవాహం గురించి ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో మహిళలపై కత్తిపీటతో దాడి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.