ఏలూరు జిల్లా భీమడోలు మండలం పాతూరు షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో జాతీయ రహదారిపై గురువారం రాత్రి 8గంటలకు భారీవృక్షం నేలకొరిగింది. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న భీమడోలు సీఐ యూజే విల్సన్ స్వయంగా రంగంలోకి దిగారు. పోలీస్, ఫైర్, హైవే పెట్రోలింగ్ సిబ్బందితో కలిసి సీఐ శ్రమించి వృక్షాన్ని రహదారికి అడ్డుతొలగించారు. దీంతో ట్రాఫిక్ క్లియర్ అయింది. ఈ సందర్భంగా వాహనదారులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సీఐ విల్సన్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.