కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ పరిది వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు నాలుగో రోజు ఘనంగా కొనసాగుతున్నాయి. గణపతి బప్పా మోరియా నామస్మరణంతో వీధులన్ని మారుమోగుతున్నాయి. ఇందులో భాగంగా పోరుమామిళ్ల మండలంలోని కొండు గారి పల్లె గ్రామంలో విజ్ఞాలను తొలగించే బొజ్జ గణపయ్యకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గణేష్ ని మండపం వద్ద మహిళలతో కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. మండపం వద్ద కుర్చీల ఆటపోటీలు, చిన్నారుల డీజే డాన్సులతో కోలాహలం నెలకొంది.ఈ సందర్బంగా భక్తులకు నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.