అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండలం కండ్లపల్లి గ్రామంలో చంద్రశేఖర్ అనే వ్యక్తి పై సుబ్రహ్మణ్యం, శివ, వెంకటేష్, లక్ష్మీ అనేవారు కొడవలితో దాడి చేసి గాయపరిచినట్లుగా బాధితుడు ఆవేదనని వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలానికి సంబంధించి జరిగిన అంశంతో ఒక్కసారిగా తనపై దాడికి పాల్పడినట్లుగా బాధితుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వివరాలను వెల్లడించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.