కాకినాడ సరిహద్దులోని శారదా దేవి గుడి వద్ద శుక్రవారం రాత్రి రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని శనివారం ఉదయం పోలీసులు తొలగించే ప్రయత్నం చేశారు. రోటరీకి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసిన రంగా విగ్రహాన్ని అధికారులు తొలగించారు దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు భారీ సంఖ్యలు అక్కడికి చేరుకొని నిరసన తెలిపారు విగ్రహాన్ని తిరిగి అక్కడే పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై ఆందోళన ఇంకా కొనసాగుతుంది.