శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలి మండలం కిష్టపురానికి చెందిన జూనియర్ లైన్మెన్ సురేష్ విద్యుత్ షాక్కు గురై శుక్రవారం మృతి చెందారు.. స్థానిక ఏయి ఆధ్వర్యంలో కిష్టిపురంలో సురేష్ మరి కొంతమందితో కలిసి 33 కెవి విద్యుత్తు లైన్లో మరమ్మతులు చేస్తున్నారు కరెంటు వైర్లకు చెట్టు అడ్డు రావడంతో కత్తితో తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడే మృతి చెందారు.. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సత్యనారాయణ శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు తెలిపారు..