గుడివాడలో హెల్మెట్ పై అవగాహన సదస్సు స్తానిక గుడివాడలోని నాగవరప్పాడు వద్ద ట్రాఫిక్ ఎస్ఐ నాగరాజు శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో హెల్మెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల వల్ల మరణాలు చాలా వరకు తగ్గుతాయని ఆయన తెలిపారు. హెల్మెట్ లేనివారే ప్రమాదాల్లో ఎక్కువగా మరణిస్తున్నారని ఎస్ఐ అన్నారు. కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించాలని, వాహన చోదకులంతా తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన హెచ్చరించారు.