గణేష్ నిమర్జనం సందర్భంగా జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నందిపేట్ మండలంలోని ఉమ్మేడ శివారులో గల బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జన ఏర్పాటు స్థలాన్ని నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజు తో కలిసి శనివారం సాయంత్రం 5: 45 పరిశీలించారు. బ్రిడ్జి వద్ద భద్రత ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణ ప్రజల రాకపోకలు నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తున్న క్రేన్లను లైటింగ్ వైద్య సదుపాయాలను పరిశీలించారు. నందిపేట్ ఎస్సై శ్యామ్ రాజ్ కు పలు సూచనలు సలహాలను చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.