కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వెంబడి ఈ నెల 23వ తేదీ రాత్రి హోటల్ వద్ద ఆగి ఉన్న కంటైనర్ నందు గుర్తు తెలియని వ్యక్తులు కంటైనర్ లో ఉన్న 255 హెచ్ పి కంప్యూటర్ ల్యాబ్ టాప్ లు, మానిటర్ టోనర్ ను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం డిఎస్పి మహమ్మద్ మెయిన్ సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులు దగ్గర నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాదు నుండి చెన్నై వెళుతుండగా ఈ సంఘటన జరిగినట్లు వారు పేర్కొన్నారు.