శ్రీ సత్య సాయి జిల్లా ఆర్థిక అభివృద్ధికి పరిశ్రమల స్థాపన ధ్యేయంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.