అనంతపురం నగరంలోని రుద్రంపేటలో వెంకట నాయక్ అనే వ్యక్తిపై వారి సమీప బంధువులు వెంకటేష్ నాయక్ అమీనా లక్ష్మక్క లక్ష్మన్న లు రాళ్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. దీంతో వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.