శాంతించమ్మ గంగమ్మతల్లి, గోర్గల్ గ్రామస్తుల ప్రత్యేక పూజలు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు, కల్యాణి, నల్ల వాగు తదితర ప్రాంతాల నుండి మంజీరలోకి వరద పోటెత్తడంతో మంజీర నది ఉదృతంగా ప్రవహిస్తుంది. మంజీర ఒడ్డున ఉన్న బంజపల్లి, మాగి, గోర్గల్, వడ్డేపల్లి, గున్కుల్, బూర్గుల్, తుంకిపల్లి, కొమలంచ తదితర గ్రామాల్లోని పంటలు నీట మునిగాయి. జనజీవనం అతలాకుతలం అయ్యింది. నీటి ఉదృతి క్రమంగా పెరుగుతూ గ్రామంలోకి నీళ్ళు రావడంతో గోర్గల్ గ్రామస్తులు శాంతి పూజలు చేశారు. గంగమ్మ తల్లి ఇక శాంతిచమ్మ అంటూ తెప్ప పడవలను గంగమ్మ తల్లికి అర్పించారు.