పర్యావరణహితమైన మట్టి పత్రి తదితరాలతో తయారుచేసిన వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పిలుపునిచ్చారు మంగళవారం నగరంలోని వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు తయారీ పై స్కూల్ విద్యార్థులకు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కమిషనర్ మౌర్య పాల్గొని చిట్టి చేతులతో చేసిన మట్టి విగ్రహాలను పరిశీలించి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లతో పాటు పూల మొక్కలను అందజేశారు.