విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలోని అక్కరాపల్లిలో నక్కదాడిలో నలుగురు గాయపడ్డారు. ఇదే గ్రామానికి చెందిన లక్ష్మి, సూరయ్య, లచ్చమ్మ, బూరాడపేట వాసుడు చిన్నోడులు శనివారం సంతకవిటిలోని బజారు నుంచి ఇంటికి వస్తుండగా నక్క దాడి చేసింది. ఆత్మరక్షణలో ప్రతిఘటించగా నక్క చనిపోయింది. స్థానికులు బాధితులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన వీడియో ఆదివారం వైరల్ కావడంతో అటవీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన పై వివరాలు సేకరిస్తున్నారు.