ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేలుపు శ్రీ పైడితల్లి అమ్మవారి పందిరిరాట మహోత్సవం శుక్రవారం 11am ఘనంగా జరిగింది. ముందుగా అమ్మవారి చదురగుడి వద్ద ముహూర్త సమయానికి పందిరిరాట వేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని వనంగుడి వద్ద కూడా ఈ మహోత్సవాన్ని నిర్వహించారు. దీంతో అమ్మవారి సినిమాను సంబరాలకు శ్రీకారం చుట్టినట్టయింది. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కే.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు, ఆలయ పూజారులు, అధికారులు కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.