ఎరువుల దుకాణదారులు యూరియాను అధిక ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామని నల్లమాడ తహశీల్దార్ రంగనాయకులు హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో ఉన్న సంధ్య సీడ్స్ దుకాణాన్ని తహశీల్దార్ రంగనాయకులు, వ్యవసాయ అధికారి అబ్దుల్ హక్ తనిఖీ చేశారు. స్టాక్ను పరిశీలించారు. నిర్దేశించిన ధర కంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మకాలు జరపరాదని ఎరువుల దుకాణదారులను ఆదేశించారు.