శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని తూమకుంట చెక్ పోస్ట్ పరిధిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో రెండు కిలోల బంగారు చోరీకి గురైన కేసును ఎట్టకేలకు పోలీసులు చేదించారు. అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని అరెస్టు చేసి ఆయన వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రత్న కేసు వివరాలను వెల్లడిస్తూ హర్యానా రాష్ట్రానికి చెందిన అనీల్ కుమార్ పన్వార్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలని పలు బ్యాంకు దోపిడీలకు పాల్పడి జైలుకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మళ్లీ ఇలా దోపిడీలు చేస్తున్నాడు.