Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 28, 2025
రంపచోడవరం ఏజెన్సీలో వివిధ ఇంజనీరింగ్ విభాగాల ద్వారా చేపట్టిన పనులు వేగవంతముగా పూర్తిచేయాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా. సింహాచలం పేర్కొన్నారు.గురువారం స్థానిక ఐటీడీఏ సమావేశము హాల్లో వివిధ ఇంజనీరింగ్ శాఖలకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లతో, ఏఈ లతో, జెఇ లతో మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రాజెక్ట్ అధికారి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా. సింహాచలం మాట్లాడుతూ ఏజెన్సీలోని ఇల్లు లేని నిరుపేద గిరిజనులకు మంజూరైన గృహాలు వేగవంతముగా పనులు పూర్తి చేయాలని అయన అన్నారు