రాజమండ్రిలో అర్జున్ చక్రవర్తి చిత్రం యూనిట్ సందడి చేసింది. ఈ నెల 29న రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హీరో విజయ్ రామరాజు, హీరోయిన్ సిజా రోస్ సోమవారం రాజమండ్రికి విచ్చేశారు. కబడ్డీ ఆటగాడి రియల్ స్టోరీ ఆధారంగా చిత్రాన్ని తీసినట్లు వారు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.