నెల్లికుదురు పోలీసు స్టేషన్ కు చేరుకున్న ఎస్పీ గారు పోలీస్ అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది యొక్క ప్రభుత్వ కిట్ ఆర్టికల్స్‌ను తనిఖీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పర్యావరణ పరిరక్షణలో భాగంలో ఎస్పీ గారు స్వయంగా మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను, మరియు సీజ్ చేసిన వాహనాలను, రిసెప్షన్ రికార్డ్, రైటర్ రూమ్ పరిశీలించారు. పనిచేసే పరిసర ప్రాంతాలు పోలీస్ స్టేషన్ ఆవరణ శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. నెల్లికుదురు పిఎస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ ప్రారంభించారు