సూర్యాపేట జిల్లాలోని పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం క్రాస్ రోడ్డు నుంచి బైక్పై వెళ్తున్న ముగ్గురిని కారులో వెంబడించి కత్తులతో దాడికి యత్నించారు. దీంతో బైక్ పై ఉన్న ప్రయాణికులు బైకులు పడేసి బీపీ గూడెం సమీపంలోని వైన్స్ లోపలికి వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. సీసీ కెమెరాలు హత్యాయత్నం దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.