సమాజంలోని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన కలిగి ఉండాలని నేత్రదానంపై ఎలాంటి అపోహాలు పెంచుకోవద్దని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.గురువారం ఉదయం 11 గంటల సమయంలో అనంతపురం లోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నేత్రదాన పక్షోత్సవాల కార్యక్రమాల నిర్వహణలో భాగంగా జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విస్తృతస్థాయిలో నేత్రదానం పై అవగాహన కార్యక్రమం చేపట్టడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. నేత్రదానం పై ప్రతి ఒక్కరిలోనూ అవగాహన అవసరమని తెలిపారు.