పీలేరు మండలం పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లాలోని యుటిఎఫ్ కార్యదర్శిల సమావేశం జిల్లా అధ్యక్షులు హరిబాబు అధ్యక్షతన శనివారం సాయంత్రం 4గంటలకు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు, జాబీర్ భాషా మాట్లాడుతూ విద్యారంగంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని అన్నారు. వాటిలో ముఖ్యంగా ఉద్యోగులకు పిఆర్సి బకాయిలు నాలుగు డీఏలు అరియర్స్ చెల్లించాలని 2022లో పెట్టిన సంపాదిత సెలవు వారి ఖాతాల్లో జమ చేయాలని కోరారు.ఆర్థిక బకాయిల కోసం యుటిఎఫ్ ఈ నెల 15న తలపెట్టిన పోరాట కార్యక్రమం రణభేరి బైక్ ర్యాలీలో ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు