తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని విన్నమాల గ్రామానికి చెందిన ఆమవరపు శశి కుమార్ నరసరావుపేట స్పెషల్ బ్రాంచ్ ఎస్ ఐ గా పనిచేస్తూ సీఐగా పదోన్నతి పొందడంతో పలువురు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆయనను ఘనంగా సన్మానించారు. సీఐ గా పదోన్నతి పొందిన ఆయన బుధవారం స్వగ్రామం అయిన విన్నామాల గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు, సన్నిహితులు సంబరాలు నిర్వహించారు. అనంతరం సిఐ ఆమవరపు శశి కుమార్ కు పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, సన్మానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొడవలూరు సిఐ ఆమవరపు సురేంద్ర,పలువురు ఉపాధ్యాయుల