మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మంగళవారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పర్యటించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటమునిగిన పంటపొలాలను ఆయన పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరదల మూలంగా ఐన నష్టాన్ని అధికారులు సర్వే చేయాలి కానీ వారం గడిచినా కూడా ఇంకా సర్వే చేయలేదని అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రాథమిక సహకార సంఘం నెల్కి వెంకటాపూర్ వద్ద యూరియా కోసం వచ్చిన రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.