కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో గురువారం ఎంబీఏ విద్యార్థుల కోసం 30 రోజుల యుఎన్ఎక్స్ట్రీ ఉన్నతి కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. ప్రొపెసర్ సరిత మాట్లాడుతూ ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యతను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.